: కేసీఆర్ స్వగ్రామంలో రేవంత్ రెడ్డికి చేదు అనుభవం!


సీఎం కేసీఆర్ స్వగ్రామం అయిన మెదక్ జిల్లా చింతమడకలో టీడీపీ నేత రేవంత్ రెడ్డి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు రేవంత్ వెళ్లారు. ఇది తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. గ్రామ శివారులో ముళ్ల కంచెలు వేసి ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు.

దీంతో, రేవంత్ రెడ్డి నడుచుకుంటూ గ్రామంలోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే, టీడీపీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో వారితో రేవంత్ వాగ్వాదానికి దిగారు. దీంతో  ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, గ్రామంలోకి ఇరవై మంది టీడీపీ నాయకులు వెళ్లేందుకు మాత్రమే అనుమతించారు.

  • Loading...

More Telugu News