: మావుళ్లమ్మ అమ్మ వారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు
పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు ప్రాంతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త చిత్రం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారిని రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు, రామ్ చరణ్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కాగా, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.