: పోలీస్ కానిస్టేబుల్‌ను హత్య చేసి ఏమీ తెలియనట్లు ఆసుపత్రిలో చేర్చిన మహిళా కానిస్టేబుల్!


ఉత్తర ప్రదేశ్‌లోని సహారన్పూర్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ను మ‌హిళా కానిస్టేబుల్ హ‌త్య చేసింది. అనంత‌రం త‌న‌కు ఏమీ తెలియ‌న‌ట్లు అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించింది. అయితే, ఆ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా ఆయ‌న‌ను గొంతు నులిమి చంపేసినట్లు తేలింది. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేర‌కు ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళా కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి ప‌లు వివ‌రాలు తెలిపారు. కానిస్టేబుల్ లలిత్ కుమార్, ఈ హత్య చేసిన మహిళా కానిస్టేబుల్ స‌హార‌న్పూర్‌లో పక్కపక్కనే వేర్వేరు ఇళ్లల్లో అద్దెకు ఉంటున్నారని తెలిపారు. ఈ క్ర‌మంలోనే లలిత్ కుమార్ హ‌త్య‌కు గుర‌య్యాడ‌ని తెలిపారు. ఈ హ‌త్య‌కు గ‌ల కార‌ణాల గురించి తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News