: తిరుమలలో కుండపోత వర్షం.. భక్తుల ఇబ్బందులు
ఓ వైపు తెలుగు రాష్ట్రాలపై భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంటే, మరోవైపు తిరుమలలో మాత్రం వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈ రోజు మధ్యాహ్నం తిరుమలలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో అకాలవర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. అక్కడి పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడడంతో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. కుండపోత వర్షంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.