: బిఎస్ఎఫ్ నుంచి తేజ్‌బహదూర్ తొలగింపు.. వీడియో తీయడం క్రమశిక్షణా రాహిత్యమన్న అధికారులు!
జవాన్లకు పాడైపోయిన ఆహారం పెడుతున్నారని, జవాన్ల ఆహారాన్ని బయట అమ్ముకుంటున్నారని గత ఏడాది వీడియో ద్వారా తమ బాధలను వెల్లడించి, దేశ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించాడు బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్. ఇతని వీడియోతో బీఎస్ఎఫ్ అధికారులపై విమర్శల వర్షం కురిసింది. రాజకీయ, సినీ ప్రముఖులు తేజ్ బహద్దూర్ కు అండగా నిలిచారు. దీంతో, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో, తేజ్ బహదూర్ ను విధుల నుంచి తొలగించారనే వార్త సంచలనం రేపుతోంది. విధులు నిర్వహించే సమయంలో పలుమార్లు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడంతో ఆయనను తొలగించినట్టు సమాచారం. డ్యూటీలో ఉన్నప్పుడు వీడియోలు తీసుకుంటూ గడపడం నిబంధనలను అతిక్రమించినట్టే అని కొందరు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.