: విశాఖలో దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీ.. నలుగురి దుర్మరణం
విశాఖపట్నంలోని జీకేవీధి మండలం ఆర్వీనగర్లో ఈ రోజు మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి అక్కడి దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ బ్రేకులు పనిచేయకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలి వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.