: గవర్నర్తో స్టాలిన్ భేటీ... తక్షణమే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలని వినతి
తమిళనాడులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రతిపక్ష డీఎంకే పార్టీ నేత స్టాలిన్ ఈ రోజు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలపై చర్చించేందుకు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తాను చెప్పినట్లు తెలిపారు. ఢిల్లీలో నెల రోజులుగా తమ రాష్ట్ర రైతులు నిరసనలు తెలుపుతున్నారని ఆయన అన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు తాము ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే, తమను ఆయన కలవడం లేదని స్టాలిన్ అన్నారు. రైతులు చేస్తోన్న ఆందోళనకు మద్దతుగా ఈ నెల 25 రాష్ట్ర బంద్ కు స్టాలిన్ పిలుపునిచ్చారు.