: ఉరిశిక్షకైనా నేను సిద్ధమే: ఉమా భారతి


బాబ్రీ మసీదు కూల్చివేత కేసును మరోసారి విచారించాలంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కేంద్ర మంత్రి ఉమాభారతిలపై కుట్ర అభియోగాలను పునరుద్ధరించింది. రెండేళ్లలో విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉమాభారతి స్పందిస్తూ, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని, అవసరమైతే ఉరిశిక్షకు కూడా తాను సిద్ధమేనని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోను రామ మందిరాన్ని నిర్మించాలనే తాను కోరుకుంటున్నానని తెలిపారు. విచారణ రెండు గంటలు జరిగినా లేక రెండేళ్ల పాటు సాగినా ఎదుర్కోవడానికి తాను సిద్ధమని చెప్పారు.

కోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఉమాభారతి అన్నారు. ఎమర్జెన్సీ విధించింది, బలవంతంగా ముస్లింలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించింది, 1984లో మత ఘర్షణలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీనే అని మండిపడ్డారు. రామ మందిరం కట్టే విషయంలో ఎలాంటి అనుమానం లేదని... ఈ అంశం వల్లే తాము అధికారంలోకి వచ్చామని చెప్పారు.

  • Loading...

More Telugu News