: పళనిస్వామికి పన్నీర్ వర్గం షాక్?
తమిళనాడులో రాజకీయా పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. శశికళ, దినకరన్ లకు చెక్ పెట్టేందుకు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలసిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు వర్గాల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి పళనిస్వామికి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి పన్నీర్ సెల్వంకు ఇచ్చేలా ఇరు వర్గాలు అంగీకరించినట్టు వార్తలు వెలువడ్డాయి.
ఇప్పుడు మరో వార్త సంచలనం రేకిత్తిస్తోంది. పళనిస్వామికి పన్నీర్ సెల్వం వర్గం షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవే కాకుండా, ముఖ్యమంత్రి పదవి సైతం పన్నీర్ సెల్వంకే ఇవ్వాలని ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. ఈ డిమాండ్ కు పళని వర్గీయులు ససేమిరా అంటున్నారు. అయితే, ఇరు వర్గాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చివరకు ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.