: హెయిర్ స్టైల్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి


హెయిర్ స్టైల్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు ఆగిపోవడం సినీ పరిశ్రమ చరిత్రలో ఇదే మొదటి సారి కావచ్చు. ఇంతకీ ఏమా కథ అంటే... బాలీవుడ్ యువనటుడు సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న 'రీ లోడెడ్' సినిమా షూటింగ్ పూర్తయింది. దీంతో 'ఇత్తెఫాక్' అనే సినిమాలో సిద్ధార్థ్ నటిస్తున్నాడు. ఇంతలో 'రీ లోడెడ్' సినిమా దర్శకుడు సిద్ధార్థ్ అనంద్ కొన్ని సన్నివేశాలు తీయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో 'ఇత్తెఫాక్'లో నటిస్తున్న సిద్ధార్థ్ కు కబురు పెట్టి కొన్ని సీన్లు చిత్రీకరించాడు. ఈ సమయంలో సిద్ధార్థ్ హెయిర్ స్టైల్ మార్చినట్టు గుర్తించాడు. దీంతో ప్యాచ్ వర్క్ షూటింగ్ ఆపేయించి, హెయిర్ పెంచాలని సూచించాడు.

దీంతో సిద్ధార్థ్ హెయిర్ పెంచే పనిలో పడ్డాడు. హెయిర్ పెంచిన తరువాత ప్యాచ్ వర్క్ తోపాటు ప్రమోషనల్ సాంగ్ కూడా చిత్రీకరించనున్నట్టు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెలిపాడు. కాగా, ఈ సినిమా 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమాకు సీక్వెల్ అంటూ వార్తలు రావడంతో, 'నాట్ బ్యాంగ్ బ్యాంగ్-2' అని క్లాప్ బోర్డులపై కూడా రాయించామని తెలిపాడు. అయితే సిద్ధార్థ్ హెయిర్ స్టైల్ తమ సినిమా 'ఇత్తెఫాక్' కు సరిపోకపోవడంతో ఆ సినిమా షూటింగ్ కూడా ఆగింది. దీంతో కేవలం హెయిర్ స్టైల్ కోసం రెండు సినిమాల షూటింగ్ ఆపిన తొలి బాలీవుడ్ హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా నిలిచాడు. 

  • Loading...

More Telugu News