: సిమ్లాలో నదిలో పడిపోయిన బస్సు.. 44 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతోన్న ఓ బస్సు సిమ్లాలో టోన్స్ నదిలో పడిపోయింది. దీంతో బస్సులోని 44 మంది మృతి చెందారు. టోన్స్ నది సమీపం నుంచి వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పడంతో నదిలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక సిబ్బందితో చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.