: సోనూ నిగమ్ పై ఫత్వా... గుండు కొడితే రూ. 10 లక్షలట!
మసీదుల నుంచి వచ్చే ప్రార్థనలతో తనకు నిద్రాభంగం అవుతోందని, లౌడ్ స్పీకర్ల ద్వారా వచ్చే ఉపన్యాసాలు, ప్రార్థనా పిలుపులు 'గూండాగిరి' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గాయకుడు సోనూ నిగమ్ పై కోల్ కతాకు చెందిన ఓ ముస్లిం మతగురువు ఫత్వా ప్రకటించారు. ఆయనకు గుండు కొట్టించి, చెప్పుల దండ వేసి ఊరేగించిన వారికి రూ. 10 లక్షలు బహుమతి ఇస్తానని పశ్చిమ బెంగాల్ మైనారిటీ యునైటెడ్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సయిద్ షా అతిఫ్ అలీ ఆల్ ఖ్వాద్రి ఫత్వా జారీ చేశారు. సోనూకు వ్యతిరేకంగా 21వ తేదీన ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఫత్వాపై సోనూ నిగమ్ కూడా స్పందించారు. మధ్యాహ్నం తాను ఇంట్లోనే ఉంటానని, ఎవరైనా గుండు కొట్టించవచ్చని సవాల్ విసిరాడు. దీనికి మీడియా కూడా రావచ్చని, తాను ముస్లింలకు వ్యతిరేకమని నిరూపిస్తే, ఎక్కడికైనా వచ్చి క్షమాపణలు చెబుతానని అన్నాడు.