: యూటర్న్ తీసుకున్న శిల్పా మోహన్ రెడ్డి...వైసీపీలో చేరిక వాయిదా...బాబుతో భేటీ?


కర్నూలు జిల్లా టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంలో తనను పోటీకి నిలపాలని ఆయన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ సంప్రదాయం ప్రకారం ఎవరైనా నేత మరణిస్తే, వారి కుటుంబంలోని వారికే స్థానం కల్పించాలన్న విషయం గుర్తు చేస్తూ, సీటు కేటాయించేది లేదని పార్టీ అధిష్ఠానం సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వైఎస్సార్సీపీలో చేరేందుకు ఇంచుమించు ముహూర్తం కూడా ఖరారైనట్టు వార్తలు వెలువడ్డాయి. ఇంతలో పార్టీ అధిష్ఠానం ఆదేశంతో రాయబారం నడిపిన మంత్రి అచ్చెన్నాయుడు ఆయన మనసు మార్చడంలో విజయం సాధించారు. దీంతో ఆయన వైఎస్సార్సీపీలో చేరడాన్ని వాయిదా వేసుకుని, నేటి సాయంత్రం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశం కానున్నారు. 

  • Loading...

More Telugu News