: ప్రకృతి వైపరీత్యం... రాత్రికి రాత్రే దిశ మార్చుకున్న కెనడా నది
పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు ఎంతటి ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతాయో తెలియచెప్పే ఘటన ఒకటి కెనడాలో జరిగింది. ఓ నది రాత్రికి రాత్రే దిశను మార్చుకుంది. పర్వత లోయల మధ్య పయనించి బేసింగ్ నదిలో కలిసే 'స్లిమ్స్' నది తన దారిని మార్చుకుని పసిఫిక్ మహాసముద్రం వైపునకు వెళ్లిపోయింది. వాతావరణ మార్పుల కారణంగా కెనడాలోని అతిపెద్ద గ్లేసియర్ కూలడంతోనే ఇది జరిగిందని ఆపై నాలుగు రోజుల వ్యవధిలోనే వాస్తవ నదీ పరివాహక ప్రాంతం ఎండిపోయిందని 'నేచర్ జియోసైన్స్' జర్నల్ తాజా సంచిన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ మార్పు అత్యంత నాటకీయంగా జరిగిందని, రాత్రికి రాత్రే నది తన దిశను మార్చుకుందని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ గెరార్డ్ రోయ్ వెల్లడించారు. నది ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసేందుకు వర్శిటీ నేతృత్వంలో కెనడా జియోమార్ఫాలజిస్టు డానియల్ షుగర్ అధ్యయనం చేస్తున్నారని తెలిపింది.