: సమయం లేదు బాలయ్యా... చూడు పురం వైపే చూడు... హిందూపురంలో ఆసక్తి కలిగిస్తున్న పోస్టర్లు!


తాము ఎదుర్కొంటున్న తీవ్ర తాగునీటి సమస్యపై హిందూపురం వాసులు వినూత్నంగా స్పందించారు. జిల్లాలో బిందెడు నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తున్న వేళ, వెయ్యి అడుగుల లోతుకు బోర్లు వేసిన నీటి జాడ కనిపించడం లేదని, కనీసం తాగునీరిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యతిరేకంగా పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. 678 గ్రామాల్లో నీటి సమస్య ఉండగా, కేవలం 375 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి, మిగతా గ్రామాలను పక్కనబెట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో "బాలయ్యా ఇటు రావయ్యా! నీటి సమస్య తీర్చయ్యా", "చూడు... పురం వైపే చూడు... మరో వైపు చూడకు! ప్రజాగ్రహాన్ని తట్టుకోలేవు", "సమయం లేదు బాలయ్యా! నీటి సమస్య పరిష్కారమా? పలాయనమా?", అంటూ పోస్టర్లను ప్రదర్శించి తన నిరసనను తెలిపారు. ఈ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News