: ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం!


న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం నిలిచిపోవడంతో 300 మంది ప్రయాణికులకు అతిథి సత్కారం చేసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే...న్యూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వేకువజామున 1:40 నిమిషాలకు న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సిద్ధంగా ఉందని ప్రకటన వినిపించడంతో ప్రయాణికులంతా విమానం ఎక్కి కూర్చున్నారు. అనంతరం పైలట్లు విమానం ఇంజిన్ లో హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యాన్ని గుర్తించారు. దీంతో దానిని మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించినా సఫలం కాకపోవడంతో, వేరే విమానం ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఉదయం 6 గంటల వరకు ప్రయాణికులు విమానంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎయిరిండియా వేరే విమానం ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో ప్రయాణికులందరినీ సమీపంలోని ఓ హోటల్ కు చేర్చింది. సాయంత్రం 5 గంటలకు వారికి విమానం ఏర్పాటు చేయనున్నారు. 

  • Loading...

More Telugu News