: హిందూపురంలో బాలకృష్ణకు వ్యతిరేకంగా దున్నపోతులపై నినాదాలతో ర్యాలీ... పోలీసుల లాఠీ చార్జ్


నియోజకవర్గ సమస్యలు తీర్చాలంటూ వైకాపా ఆధ్వర్యంలో హిందూపురంలో బాలకృష్ణకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణంలో తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాలని, రహదారులకు మరమ్మతులు చేయాలని, ఆగిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, దున్నపోతులపై నినాదాలు రాసి, వాటిని ఊరేగింపుగా తీసుకెళ్తూ, ఈ ర్యాలీని చేపట్టారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. వైకాపా ర్యాలీని పోలీసులు అడ్డుకోగా, కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఆపై నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ, వైకాపా నేతలు రోడ్డుపై బైఠాయించడంతో వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News