: సచిన్ సినిమా విజయవంతమవ్వాలి: రజనీకాంత్


టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు చెప్పారు. సచిన్ బయోపిక్ ‘సచిన్‌: ఎబిలియన్‌ డ్రీమ్స్‌’ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ చూసిన రజనీకాంత్ సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు. ‘సచిన్‌: ఎబిలియన్‌ డ్రీమ్స్‌’ చిత్రం విజయవంతమవ్వాలని కోరుకుంటున్నానని...గాడ్ బ్లెస్' అని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జేమ్స్ ఎర్సకైన్ దర్శకత్వం వహించిన ‘సచిన్‌: ఎబిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమాకు ఏఆర్.రహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • Loading...

More Telugu News