: ప్రజలను మోసం చేస్తున్న ఆపిల్, ఎయిర్ టెల్ సహా 143 కంపెనీలు: ఆస్కీ


తప్పుడు టెలివిజన్ ప్రకటనలు ఇస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపిస్తూ, ప్రకటనల వాచ్ డాగ్ ఆస్కీ (ఎడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) మొత్తం 143 కంపెనీలకు షాకిచ్చింది. తమకు అందిన 191 ఫిర్యాదులను పరిశీలించిన తరువాత 143 కంపెనీల ప్రకటనలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని, నిజాయతీ లేని వీటిని తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. భారతీ ఎయిర్ టెల్, ఆపిల్, కోకకోలా, థమ్స్ అప్, అమూల్, నివియా తదితర ఎన్నో కంపెనీలను తప్పుబట్టింది.

డిజిటల్ పేమెంట్ సంస్థ మొబీ క్విక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఒపెరా, పెర్నార్డ్ రికార్డ్ తదితరాలపై వచ్చిన ఫిర్యాదులు నిజమేనని చెబుతూ, కౌన్సిల్ రెగ్యులేటరీకి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఆరోగ్య విభాగంలో 102, విద్యా విభాగంలో 20, పర్సనల్ కేర్ విభాగంలో 7 ఫిర్యాదులను అంగీకరించినట్టు తెలిపింది. ఐఫోన్ సంస్థ 7 వేరియంట్ కోసం తప్పుడు ఇమేజ్ ని చూపుతూ ప్రచారం చేస్తోందని చెప్పింది. ఎయిర్ టెల్ పై వచ్చిన మూడు ఫిర్యాదులు నిజమేనని, అవి కస్టమర్లను మోసం చేస్తున్నాయని తేల్చింది. రిన్ సోప్ యాంటీ బ్యాక్టీరియా ప్రకటన తప్పని, కోకకోలా చూపుతున్న సాహసాలు అత్యంత ప్రమాదకరమని చెప్పింది.

  • Loading...

More Telugu News