: సాక్ష్యాలు దొరకలేదట... రాసలీలల మాజీ మంత్రికి క్లీన్ చిట్!
రాసలీలల వ్యవహారంలో కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి హెచ్.వై.మేటీ అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. రాసలీలల్లో ఆయన పాల్గొన్నట్టు వీడియోలు సైతం లీక్ అయ్యాయి. అయితే, ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సీఐడీ మాత్రం అతనికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో వారంలోగా సీఐడీ అధికారులు తమ నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. తగిన సాక్ష్యాధారాలు లభించకపోవడంతో, మేటీకి క్లీట్ చిట్ ఇస్తున్నారు. మరోవైపు, మేటీకి క్లీన్ చిట్ వస్తే తమ ప్రభుత్వ ప్రతిష్ట బాగా పెరుగుతుందని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.