: కొల్లేరు సరస్సు వద్ద రామ్ చరణ్, ఉపాసన.. చూసేందుకు ఎగబడిన అభిమానులు!


పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు వద్ద యువ హీరో రామ్ చరణ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా షూటింగ్ స్పాట్ లో సందడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ఈ నేపథ్యంలో, అక్కడి పరిసర ప్రాంతాలు జాతరను తలపించాయి. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ మాగంటి బాబు రామ్ చరణ్ ను కలిసి... ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కొల్లి వరప్రసాద్, నల్లగోపుల చలపతి, ఆలిండియా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు తదితరులు రామ్ చరణ్ కు అభినందనలు తెలిపారు. 

  • Loading...

More Telugu News