: దినకరన్ ఎక్కడికీ పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు


ఎన్నికల కమిషన్ కే లంచం ఇవ్వజూపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ పై ఉచ్చు మరింతగా బిగిసింది. ఈ కేసులో ఆయన దేశం విడిచి పారిపోయే అవకాశాలు ఉన్నాయంటున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఆ అవకాశం ఇవ్వకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు అన్ని ఎయిర్ పోర్టులకూ నోటీసులు వెళ్లాయి. కాగా, దినకరన్ ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదయం 10 గంటలకు తనపై ఉన్న ఫెరా కేసు విచారణలో భాగంగా ఆయన హైకోర్టుకు హాజరు కానుండటంతో, కేసు విచారణ ముగిసిన వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News