: క్రిస్ గేల్ కు రికార్డు గుర్తు చేసిన బద్రీ!
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ టీ20ల్లో 10 వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడైన గేల్ నిన్న గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకు పడి 77 పరుగులు చేశాడు.
10 వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు మరో 3 పరుగుల దూరంలో ఉన్నానని మ్యాచ్ కు ముందు శామ్యూల్ బద్రీ గుర్తు చేశాడని గేల్ చెప్పాడు. రికార్డును సాధిస్తానని బద్రీ చెప్పాడని... తనకు కూడా మనసులో అదే ఉందని తెలిపాడు. ఈ ఘనత సాధించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు. టీ20ల్లో 10 వేల పరుగులను సాధించడం తనకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. ఈ లక్ష్య సాధనలో తనకు సహకరించిన అభిమానులకు, ఫ్రాంఛైజీలకు ధన్యవాదాలు తెలిపాడు.