: టీడీపీలో చేరనున్న లగడపాటి?


బెజవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, ఇటీవలి కాలంలో మౌనంగా న్న లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో విజయవాడ నుంచి లోక్ సభ సభ్యుడిగా బరిలోకి దిగాలని భావిస్తున్న ఆయన, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కలిసి నగరంలో పార్టీ పటిష్ఠతపై తాను చేయించిన సర్వే నివేదికను స్వయంగా అందించినట్టు సమాచారం. రెండు రోజుల క్రితం వీరిద్దరి మధ్యా భేటీ జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారిద్దరూ ఎందుకు కలిశారు? ఏం మాట్లాడుకున్నారన్న విషయాలు మాత్రం బయటకు రాలేదు. చంద్రబాబుతో సమావేశం అనంతరం అక్కడే వేచి చూస్తున్న మీడియాతో మాట్లాడకుండానే లగడపాటి వెళ్లిపోయారు. ఇక లగడపాటి చేరికతో విజయవాడలో తమ బలం పెరుగుతుందని తెలుగుదేశం వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • Loading...

More Telugu News