: కొరియాతో భారీ డీల్ పై సంతకం చేయనున్న భారత్


మహాసముద్రాల్లో గనులను గుర్తించి, వాటి నుంచి ఖనిజాలను వెలికితీసుకువచ్చే భారీ ఓడల నిర్మాణానికి సంబంధించి దక్షిణ కొరియా రక్షణ సంస్థతో భారత్ ఓ చారిత్రాత్మక డీల్ ను కుదుర్చుకోనుంది. మొత్తం రూ. 35 వేల కోట్ల అంచనా వ్యయం అవుతుందని భావిస్తున్నారు. గోవా షిప్ యార్డ్, సౌత్ కొరియా మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని, డిసెంబర్ లోగా డీల్ పై సంతకాలు జరుగుతాయని నేవీ యుద్ధ నౌకల ఉత్పత్తి, సేకరణ, నియంత్రణ విభాగం వైస్ అడ్మిరల్ డీఎం దేశ్ పాండే వెల్లడించారు.

న్యూఢిల్లీలో ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన, ల్యాండింగ్ ప్లాట్ ఫాం డాక్ లను కొనుగోలు చేసే ఒప్పందాన్ని ఈ ఏడాదిలోనే ఖరారు చేయనున్నట్టు తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే యుద్ధ నౌక రెండో దశ ప్రాజెక్టు కోసం నిధులను విడుదల చేయాలని రక్షణ శాఖను కోరామని, మరో 57 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని కూడా నౌకాదళం యోచిస్తోందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News