: నన్ను చంపేస్తారేమో... సెక్యూరిటీ కోసం కోర్టును ఆశ్రయించిన సుకేష్
రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్ కు రూ. 60 కోట్ల వరకూ టీటీవీ దినకరన్ లంచం ఇవ్వజూపిన కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన సుకేష్ చంద్రశేఖర్, ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించాడు. రాజకీయ కారణాల నేపథ్యంలో తనను అరెస్ట్ చేసినందున, చంపేస్తారన్న భయం ఉందని, పోలీసు బందోబస్తుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది ఢిల్లీ సీజ్ అజారే జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, సుకేష్ ను సమగ్రంగా విచారించిన తరువాతే దినకరన్ ను అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో సుకేష్ పై 19 వరకూ కేసులుండగా, వాటన్నింటినీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తవ్వుతున్నారు.