: శశికళపై వేటును వ్యతిరేకించిన 10 మంది ఎమ్మెల్యేలు.. దినకరన్ తో భేటీ!
తమిళనాడు అన్నాడీఎంకేలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీ నుంచి శశికళ కుటుంబాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించిన కాసేపటికే.... పది మంది ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్ తో సమావేశమయ్యారు. ఈ పదిమంది ఎమ్మెల్యేలు తమతో చర్చించకుండానే మంత్రి జయకుమార్ చిన్నమ్మ, దినకరన్ కుటుంబాలను పక్కనపెట్టాలని నిర్ణయం తీసుకున్నారని ఆరోపించడం విశేషం. ఈ సందర్భంగా టీటీవీ దినకరన్ మాట్లాడుతూ, తమను బహిష్కరించే అధికారం అన్నాడీఎంకే నేతలకు లేదని ప్రకటించారు. కాగా, ఇది ఆసక్తి రేపుతోంది. తాజా ఘటనల నేపథ్యంలో అన్నాడీఎంకేలో వివిధ వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టమైంది. మన్నార్ గుడి మాఫియా వర్గం ఇంకా శశికళకు మద్దతుగానే ఉందని, పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని తమిళనాడులో గుసగుసలు వినిపిస్తున్నాయి.