: అన్నాడీఎంకే నుంచి శశికళ కుటుంబం బహిష్కరణ!
అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ కుటుంబాన్ని బహిష్కరించారు. ఈ మేరకు అన్నాడీఎంకే పార్టీ నేతలు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. శశికళ బహిష్కరణను 122 మంది ఎమ్మెల్యేలు సమర్థించడం గమనార్హం. పార్టీని నడిపించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి జయకుమార్ ప్రకటించారు. కాగా, పళనిస్వామి-పన్నీరు సెల్వం వర్గాల మధ్య రాజీ కుదిరింది. దీంతో, అన్నాడీఎంకేలో మన్నార్ గుడి కుటుంబం కథ ముగిసినట్టయింది.