: మమతా బెనర్జీని పూరీ ఆలయంలోకి రానీయమన్న వ్యక్తి అరెస్టు!


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పూరీ జగన్నాథస్వామి ఆలయంలోకి ప్రవేశించనీయమంటూ జగన్నాథ సేవాయాత్ సమ్మిళని కార్యదర్శి సోమనాథ్ కుంతియా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఒడిశా రాష్ట్రంలో మమతా బెనర్జీ పర్యటన  నేపథ్యంలో సోమనాథ్ కుంతియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఆమె భువనేశ్వర్ కు చేరుకుని, అక్కడి నుంచి పూరీ వెళతారు. ఈ రాత్రికి అక్కడే బస చేసి, రేపు ఉదయం జగన్నాథ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. గురువారం ఉదయం తిరిగి కోల్ కతాకు బయలుదేరి వెళతారు.

కాగా, బీఫ్ వినియోగాన్ని సమర్థిస్తున్న మమతా బెనర్జీని ఆలయంలోకి ప్రవేశించనీయమని, ఆమె వ్యాఖ్యలతో లక్షలాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని సోమనాథ్ కుంతియా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, జగన్నాథ స్వామి ఆలయ సీనియర్ సేవకులు జగన్నాథ్ దాస్ మహాపాత్ర మాట్లాడుతూ, సీఎం మమతా బెనర్జీ రాకను తాము స్వాగతిస్తున్నామని, అన్ని మర్యాదలతో ఆమెను ఆలయంలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. స్వార్థప్రయోజనాల నిమిత్తం కొందరు చేసే ప్రకటనలను పట్టించుకోమని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News