: 10 వేల ప‌రుగుల మైలురాయి... క్రిస్‌గేల్ అరుదైన రికార్డు


వెస్టిండీస్ స్టార్ ఆట‌గాడు క్రిస్ గేల్ టీ20 మ్యాచుల్లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఆ ఫార్మాట్‌లో 10 వేల ప‌రుగులు చేసిన మొద‌టి ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. త‌న కెరీర్‌లో మొత్తం 290 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్ ఈ ఘ‌న‌త‌ను సాధించి, అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటున్నాడు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ఐపీఎల్ సీజ‌న్‌లో క్రిస్‌గేల్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌ఫున ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఈ రోజు గుజ‌రాత్ ల‌య‌న్స్‌తో జ‌రిగిన ఆట‌లో క్రిస్ గేల్ 10వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఆ క్ర‌మంలో నిన్న‌టి వ‌ర‌కు కేవ‌లం మూడు పరుగుల దూరంలో ఉన్న క్రిస్‌గేల్ ఈ రోజు గుజరాత్ బౌలర్ బాసిల్ తంపి వేసిన నాల్గో ఓవర్ మూడో బంతికి పదివేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News