: ఈ రోజు పర్యటనలో నా అభిమాన ఫొటో ఇది: ఎంపీ కవిత
టీఆర్ఎస్ ఎంపీ కవిత ఈ రోజు జగిత్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా తన పర్యటనకు సంబంధించిన కొన్ని ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. వీటిలో ఒక ఫొటో గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఎందుకంటే, ఆ ఫొటో అంటే తనకు ఎంతో అభిమానం అని కవిత స్వయంగా తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఇంతకీ, ఆ ఫొటో గురించి చెప్పాలంటే.. ఓ చిన్నారి చిన్న సైకిల్ పై కూర్చుని ఉండగా, దాని హ్యాండిల్ కు టీఆర్ఎస్ జెండా కట్టి ఉంది. ఫొటోకు పోజు ఇస్తున్న ఆ పిల్లాడి ఫొటోను పోస్ట్ చేసి.. ‘ఈ రోజు పర్యటనలో నా అభిమాన ఫొటో.. జై తెలంగాణ!!’ అని కవిత పేర్కొనడం గమనార్హం.