: 15 కుక్కలను దత్తత తీసుకున్న విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కుక్కలంటే ఎంతో ఇష్టం. ఇటీవల కోహ్లీ 15 కుక్కలను దత్తత తీసుకున్నాడు. ఈ విషయాన్ని కేర్ సంస్థ తమ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించడంతో అందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్-10 సీజన్‌లో కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన బెంగళూరులోని చార్లీ జంతు సంరక్షణ కేంద్రానికి వెళ్లి, అక్కడ ఉన్న ప్రత్యేక అవసరాలు కలిగిన కుక్కలను చూశాడు. వెంటనే వాటిని దత్తత తీసుకుంటున్నానని తెలిపి, వాటికి కావాల్సినవన్నీ తానే ఏర్పాటు చేస్తానని తెలిపాడు. ఈ సందర్భంగా ఆ కుక్కలను ఎత్తుకొని అపురూపంగా చూశాడు.