: ఆ విషయం కేసీఆర్ నిర్ణయిస్తారు: ఎంపీ కవిత
టీఆర్ఎస్ మహిళా నేత, నిజామాబాద్ జిల్లా ఎంపీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో ఓ న్యూస్ ఛానెల్ అడిగిన ఒక ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ వన్ నుంచి నెంబర్ వన్ థౌజండ్ వరకు కూడా కేసీఆర్ గారే ఉంటారు. ఆయన తప్పించి ఇంకొకరెవ్వరూ ఉండరు. నెంబర్ గేమ్ అనేది మా పార్టీలో ఉండదు’ అని కవిత చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తానా? లేక లోక్ సభకు పోటీ చేస్తానా? అనేది కేసీఆర్ నిర్ణయిస్తారని మరో ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. ప్రజలు తమ ప్రభుత్వాన్ని, పార్టీని ఆశీర్వదిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు కవిత సమధానం చెప్పకుండా దాటవేయడం గమనార్హం.