: మా రెస్టారెంటు రాందేవ్‌బాబాది కాదు: పోష్టిక్‌ రెస్టారెంటు యజమాని


యోగా గురు రాందేవ్ బాబా రెస్టారెంట్ల బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చి, చండీగఢ్‌లో ‘పోష్టిక్‌ రెస్టారెంటు’ అనే పేరుతో ఓ రెస్టారెంటు ప్రారంభించార‌ని ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఎన్నో వార్తలు వ‌చ్చాయి. అందుకు కార‌ణం ఆ రెస్టారెంటు పతంజలికి చెందినదన్నట్లుగా రాందేవ్ బాబా ఫొటో ఉండడ‌మే. ‘పోష్టిక్‌ రెస్టారెంటు’ అంటూ ఆ రెస్టారెంటు పోస్ట‌ర్‌పై పతంజ‌లి ప్రొడెక్ట్‌ల బొమ్మ‌లు ఉన్నాయి.

అయితే, సోష‌ల్ మీడియాలో ఈ వార్త బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డంతో ఆ రెస్టారెంటు యజమాని అలోక్‌ శర్మ అనే రిటైర్డ్‌ కల్నల్‌ ఈ అంశంపై స్పందించారు. ఆ రెస్టారెంటు రాందేవ్‌బాబాది కాదని చెప్పారు. తాము పతంజలి ఉత్పత్తులను తమ రెస్టారెంటులో వాడతామని చెప్పారు. ఆ ఉత్ప‌త్తులతో ఎన్నో పోషక విలువలతో కూడిన వంటలు సిద్ధం చేస్తామని అన్నారు. తాము అందుకే త‌మ‌ రెస్టారెంటుకు అలా పేరు పెట్టామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News