: దేశ చరిత్రలోనే ఎవరి వల్లా కాలేదు.. ఇక, కేటీఆర్ వల్ల ఏమవుతుంది?: పొంగులేటి


కాంగ్రెస్ పార్టీని ఉప్పు పాతరేయడం దేశ చరిత్రలోనే ఎవరికీ సాధ్యపడలేదని, ఇక, కేటీఆర్ వల్ల ఏమవుతుందని సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అధికారం చేతిలో ఉండటంతో కేటీఆర్ తన ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు, అవినీతి నిర్మూలనపై దృష్టి పెట్టమని తాము అడగడం తప్పా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేటీఆర్ తన నోటిని అదుపులో పెట్టుకోని పక్షంలో ప్రజలే ఆయనకు తగిన సమాధానం చెబుతారని అన్నారు. పోలవరం ముంపు, ఓటుకు నోటు కేసు, ఎంసెట్-2 లీకేజ్ అంశాలను ఆయన ప్రస్తావించారు. ఎంసెట్-2 లీకేజ్ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News