: భారత్‌కు రాకుండా ఉండేందుకు విజయ్ మాల్యా ప్రయత్నాలు
భారతీయ బ్యాంకుల్లో దాదాపు రూ.9 వేల కోట్లు అప్పులు చేసి, లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను ఈ రోజు అక్కడి పోలీసులు అరెస్టు చేయడం, అనంతరం మూడు గంటల్లోనే ఆయనకు బెయిల్ రావడం చకచకా జరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే, విజయ్ మాల్యా చట్టం నుంచి తప్పించుకునేందుకు దొరికిన అన్ని అవకాశాలను వాడుకోవాలని యోచిస్తున్నారు. తనను భారత్‌కు అప్పగించకూడదంటూ అక్కడి పై కోర్టులో పిటిషన్ వేస్తానని ఆయన తెలిపారు. అయితే, ఆయనను వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాలని భారత అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.