: జనసేన సైనికుల కోసం మూడు రోజుల పాటు అర్హత పరీక్ష నిర్వహిస్తాం: పవన్ కల్యాణ్
జనసేన కోసం పనిచేసే సైనికులను నియమించుకోవడం కోసం ఉత్సాహవంతులైన యువత నుంచి ఆ పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ దరఖాస్తులు కోరిన విషయం తెలిసిందే. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగియడంతో ఈ రోజు ఆయన దానిపై ప్రకటన చేశారు. ఈ నెల 21 నుంచి అనంతపురం జిల్లాలో జనసేన కార్యకర్తల ఎంపిక జరపనున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురం జిల్లా నుంచి మొత్తం 3,600 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. తమ పార్టీ సైనికుల ఎంపిక కోసం మూడు రోజుల పాటు అర్హత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.