: ఆ ఫొటోను నమ్మకండి.. నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు.. : తమిళనటి వరలక్ష్మి
తమిళనటి వరలక్ష్మిని మంచానికి కట్టేసి, ఆమె నోటిని ప్లాస్టర్ తో మూసేసి ఉన్న దృశ్యంతో కూడిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమంలో దర్శనవిుచ్చింది. పైగా, ఆమె కిడ్నాప్ నకు గురైందంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో, వరలక్ష్మి అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందారు. అసలు విషయం ఎంతకీ తెలియకపోవడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో తన అభిమానులకు సంతోషకరమైన విషయాన్ని వరలక్ష్మి ప్రకటించింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రం ప్రచారం నిమిత్తం ఈ ఫొటోను తమ చిత్ర యూనిట్ పోస్ట్ చేసిందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వరలక్ష్మి స్పష్టం చేసింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ చిత్రం వివరాలు తెలియజేస్తానని వరలక్ష్మి తెలిపింది.
I'm absolutely fine.. thank u for ur concern..it's a part of our movie promotion.. announcement at 6pm..!!
— varu sarathkumar (@varusarath) April 18, 2017