: విజయ్ మాల్యా ఏయే బ్యాంకుకు ఎంతెంత చెల్లించాలో చూడండి
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఎట్టకేలకు లండన్ లో అరెస్ట్ అయ్యారు. అతడిని లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. అనంతరం, బెయిల్ పై మాల్యా బయటకు వచ్చారు. వివిధ బ్యాంకులకు మాల్యా బకాయి పడ్డ మొత్తం 9 వేల కోట్లకు పైగానే ఉంది. ఆ వివరాలు కింద తెలిపిన విధంగా ఉన్నాయి.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - రూ. 1650 కోట్లు
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ - రూ. 800 కోట్లు
- ఐడీబీఐ బ్యాంక్ - రూ. 800 కోట్లు
- బ్యాంక్ ఆఫ్ ఇండియా - రూ. 650 కోట్లు
- బ్యాంక్ ఆఫ్ బరోడా - రూ. 550 కోట్లు
- యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - రూ. 430 కోట్లు
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - రూ. 410 కోట్లు
- యూకో బ్యాంక్ - రూ. 320 కోట్లు
- కార్పొరేషన్ బ్యాంక్ - రూ. 310 కోట్లు
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ - రూ. 150 కోట్లు
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - రూ. 140 కోట్లు
- ఫెడరల్ బ్యాంక్ - రూ. 90 కోట్లు
- పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ - రూ. 60 కోట్లు
- యాక్సిస్ బ్యాంక్ - రూ. 50 కోట్లు
- మరో 3 బ్యాంకింగ్ సంస్థలకు - రూ. 603 కోట్లు
- మొత్తం - రూ. 6963 కోట్లు