: ఇండియన్ మీడియా ఎక్కువ చేసి చూపిస్తోంది: విజయ్ మాల్యా ట్వీట్
భారత బ్యాంకుల్లో రూ.9 వేల కోట్లు అప్పులు చేసి లండన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను భారత్ తీసుకురావడానికి సీబీఐ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలో మాల్యా ఈ రోజు ఓ ట్వీటు చేయడం గమనార్హం. తన అరెస్టు విషయంలో ఇండియన్ మీడియా ఎక్కువ చేసి చూపిస్తోందే తప్పా ఏమీ లేదని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నాడు. అక్కడి కోర్టులో ఈ రోజు ప్రారంభమైన విచారణ ముందుగానే ఊహించిందేనని, అంతే తప్ప కొత్తగా ఏమీ లేదని ట్వీట్ చేశాడు.
Usual Indian media hype. Extradition hearing in Court started today as expected.
— Vijay Mallya (@TheVijayMallya) 18 April 2017