: వర్మతో మళ్లీ సినిమా చేయాలని ఉంది: మోహన్ లాల్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి మరోమారు పనిచేయాలని అనుకుంటున్నట్లు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చెప్పారు. వర్మ-మోహన్ లాల్ కాంబినేషన్ లో ఓ కొత్త సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నట్టు ఈ ప్రకటన ద్వారా తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ‘విలన్’ సినిమా షూటింగ్ లో తీరిక లేకుండా మోహన్ లాల్ ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులపై దృష్టి పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వర్మ-మోహన్ లాల్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కేందుకు ఎంత కాలం పడుతుందో మరీ! కాగా, 2002లో వర్మ దర్శకత్వంలో విడుదలైన ‘కంపెనీ’ చిత్రంలో మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు ఐఫా అవార్డులను సొంతం చేసుకుంది.