: మాల్యానే స్వయంగా లొంగిపోయారా? .. పోలీసులు అరెస్ట్‌ చేశారా? అనే దానిపై స్పష్టత లేదు: కింగ్‌ఫిషర్‌ మాజీ ఉద్యోగి నీతూ


భారతీయ బ్యాంకుల్లో అప్పు చేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను లండన్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయ‌న‌ను వెస్ట్ మినిస్టర్  కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. అయితే, ఆయ‌న‌ను భారత్‌కు తీసుకురావ‌డానికి న్యాయ‌ప‌ర ప్రక్రియ అంతా ముగియడానికి నెల రోజులుపట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

కాగా, విజ‌య్ మాల్యా అరెస్ట్‌పై కింగ్‌ఫిషర్‌ మాజీ ఉద్యోగి నీతూ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... విజ‌య్‌ మాల్యా లండ‌న్‌లో పోలీసుల ముందు స్వయంగా  లొంగిపోయారా? లేక పోలీసులు అరెస్ట్‌ చేశారా? అనే విష‌యంపై స్ప‌ష్ట‌త లేద‌ని అన్నారు. ఆయ‌న‌ను భారత్‌ రప్పించేందుకు కీలక అడుగు పడిందని అన్నారు. విజ‌య్ మాల్యా అరెస్టు ఇతర లోన్‌ డిఫాల్టర్లకు ఒక హెచ్చరిక అని ఆమె వ్యాఖ్యానించారు. మాల్యాను భార‌త్‌కు ర‌ప్పించ‌డానికి కేంద్ర స‌ర్కారు ఏడాదికాలంగా బ్రిటీష్ అధికారుల‌తో ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది. ఎట్టకేలకు మాల్యా అరెస్టు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

  • Loading...

More Telugu News