: జూన్ లో మోదీ, నవాజ్ షరీఫ్‌ల భేటీ!
కజకిస్థాన్ రాజధాని అస్తానాలో ఈ ఏడాది జూన్‌లో షాంఘై సహకార సంఘం(ఎస్‌సీఓ) సమావేశాలు జరగనున్నాయని, అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పాల్గొంటారని పాక్‌కు చెందిన ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మోదీ, నవాజ్ షరీఫ్‌లు భేటీ అవుతారని చెప్పింది. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్, పాక్‌ల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలని మిగతా ఎస్‌సీఓ సభ్యులు ఒత్తిడి తెస్తున్నట్లు ఆ పత్రికలో పేర్కొన్నారు.