: ఏపీలో మరో రెండు రోజుల పాటు వడగాల్పులు!
ఏపీలో మరో రెండు రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు వడగాల్పులు తప్పవని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.