: అమానవీయ ఘటన.. బైక్‌పై మృతదేహం తరలించిన వైనం!
మధ్యప్రదేశ్, సిధి జిల్లాలోని అమిలియా ప్రాంతంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బ్యాంకులో పింఛన్ డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలు(70) క్యూలైన్‌లో నిలబడి, ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. అయితే, ఆమె మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేందుకు అంబులెన్స్ కోసం ప్రయత్నించగా, వాహనం దొరకకపోవడంతో ఆమె బంధువులు వృద్ధురాలి మృతదేహాన్ని బైకుపైనే తీసుకెళ్లారు. కొన్ని నెలల క్రితం ఇటువంటి ఘటనలే వెలుగులోకి వచ్చి కలకలం రేపిన విషయం తెలిసిందే. అప్పట్లో ఒడిశాలో భార్య మృతదేహాన్ని భర్త భుజాన వేసుకుని కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాడు. అనంతరం కూడా పలు చోట్ల మృతదేహాలను సైకిల్‌పైన, బైక్ పైన వేలాడదీసుకుని వెళ్లిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.