: విజయ్ మాల్యా జైలుకి వెళ్లే రోజులు దగ్గరపడ్డాయి.. తదుపరి లక్ష్యం లలిత్ మోదీయే: సుబ్రహ్మణ్య స్వామి
భారతీయ బ్యాంకుల్లో రూ.9 వేల కోట్లు అప్పులు చేసి అవి తీర్చకుండా లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. అవినీతి నిరోధంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవను ఆయన కొనియాడారు. విజయ్ మాల్యా జైలుకి వెళ్లే సమయం దగ్గరపడిందని ఆయన అన్నారు. మాల్యా అరెస్టు విషయం ఆరంభం మాత్రమేనని, ఇక కేంద్ర ప్రభుత్వం తదుపరి లక్ష్యం అంతా లలిత్ మోదీ పైనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.