: హేమమాలిని వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడలేదు: ఎమ్మెల్యే ఓం ప్రకాశ్


నాటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినిపై మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ బాబారావు అలియాస్ బచ్చు కడు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మన దేశంలో క్రికెటర్లు ఎన్ని పరుగులు చేశారో గుర్తు పెట్టుకుంటారు కానీ... రైతుల దుస్థితి గురించి మాత్రం పట్టించుకోరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ మద్యం తాగే అలవాటున్న వారే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కొందరు అంటుండటం దారుణమని... ప్రతి రోజు మద్యం సేవించే హేమమాలిని ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదంటూ ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై నలువైపుల నుంచి విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. తాను హేమమాలిని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదని... సినిమాల్లో ఆమె మద్యం తాగుతారని మాత్రమే చెప్పానని అన్నారు. 

  • Loading...

More Telugu News