: చంద్రబాబుపైన, పోలీసులపైన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి


కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇటీవల వాయిదా పడటం విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి తన చెప్పుతో తాను కొట్టుకుని నానా హంగామా సృష్టించడం, ఈ ఎన్నిక వాయిదా పడటానికి కారణం సీఎం చంద్రబాబు, పోలీసులే అని ఆయన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రసాదరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ నేతలకు పశ్చాత్తాపం కలగాలనే ఉద్దేశంతోనే ఆ రోజున తాను ఆ విధంగా ప్రవర్తించానని అన్నారు. రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రజాస్వామ్యాన్ని అమ్ముకున్నారని విమర్శించిన ఆయన, సీఎం చంద్రబాబుపైన, పోలీసులపైన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, తన వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ప్రసాదరెడ్డి కోరారు.

  • Loading...

More Telugu News