: శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు... దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం
పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలలోకి యాభై ఏళ్ల లోపు ఉన్న మహిళలు ప్రవేశించారన్న వార్తలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. కొంతమంది యువతులు ఆలయంలో పూజలు చేస్తున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. కొల్లాంకు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుటుంబ సమేతంగా శబరిమలకు వచ్చినప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. నిబంధనలను అతిక్రమించి మహిళలు ఆలయంలోకి వెళ్లినట్టు సమాచారం. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. అంతేకాదు, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. శబరిమల ఆలయంలోకి పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.