: పాఠశాల భవనంపై విరిగిపడిన చెట్టు.. 40 మంది ఉపాధ్యాయులకు గాయాలు
పాఠశాల భవనంపై ఓ చెట్టు విరిగిపడడంతో 40 మంది ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయిన ఘటన విశాఖపట‍్టణం జిల్లా జి.మాడుగులలో చోటు చేసుకుంది. పాఠశాల భవనంలో ఉపాధ్యాయులందరూ సమావేశమై చర్చిస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన 40 మంది ఉపాధ్యాయులను అక్కడి ప్రభుత్వాసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. చెట్టు ఒక్కసారిగా విరిగిపడడంతో పాఠశాల భవనం దెబ్బతిని ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.